విజయవాడ: గుండెపోటుతో మరణించిన కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ మహ్మద్ కరీమున్నీసా భౌతికకాయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతపురం కరీమున్నిసా కుటుంబ సభ్యులను సీఎం జగన్ పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. హోం మంత్రి సుచరిత, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు కూడా ఎమ్మెల్సీ కరీమున్నిసా భౌతికకాయానికి నివాళులర్పించారు.