ఢిల్లీః జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌కి స్వచ్ఛ భారత్ అవార్డుల పంట పండింది. దేశంలో పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగ్గా నిర్వహించాలనే ఉద్దేశంతో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఏపీ పలు కేటగిరిలో అవార్డులను కైవసం చేసుకుంది. అవార్డుల వివరాలు.. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో విజయవాడకు మూడో ర్యాంక్ రాగా, రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్న విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్,అధికారులు ఈ అవార్డుని అందుకున్నారు. అనంతరం విజయవాడ మేయర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రోత్సాహంతో ఇది సాధ్యమైందన్నారు.