మండలంలో ఏకధాటిగా రెండు వారాల నుంచి కురుస్తున్న వర్షాలకు చేతికి అందొచ్చిన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరి, చోడి పంటలు చాలా గ్రామాల్లో నీటి పాలయ్యాయి. వేంగడ గ్రామంలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. తమను ఆదుకోవాలని వర్ష బాధిత రైతులు కోరుతున్నారు.
కశింకోట : మండలంలో ఉగ్గినపాలెం గ్రామంలో మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షం కారణంగా గ్రామానికి చెందిన గాలి రాజుకు చెందిన ఓ పాడి గేదె ఆదివారం చనిపోయింది. దీని విలువ రూ.60 వేలు ఉంటుంది. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్‌ కలగ గున్నయ్యనాయుడు, ఎంపిపి కలగ లక్ష్మి, ఉప సర్పంచ్‌ లక్కరాజు గోవింద, పశు సంవర్థక శాఖ అధికారులు గ్రామాన్ని సందర్శించారు. రైతును ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

By admin

Leave a Reply

Your email address will not be published.