తిరువనంతపురం: తనను వివాహం చేసుకునేందుకు నిరాకరించిన యువకుడిపై వివాహిత యాసిడ్‌తో దాడిచేసింది. కేరళలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధిత యువకుడు తిరువనంతపురంలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. 28 ఏళ్ల అనిల్ కుమార్, ఇద్దరు పిల్లలకు తల్లి అయిన షీబా సోషల్ మీడియా ద్వారా స్నేహితులుగా మారారు.

వీరి స్నేహం క్రమంగా ముదిరింది. అయితే, ఆ తర్వాత కుమార్ ఆమెతో స్నేహానికి ముగింపు పలికి మరో యువతిని పెళ్లి చేసుకోవాలని భావించాడు. విషయం తెలిసిన షీబా కుమార్‌కు ఫోన్ చేసి మాట్లాడింది. పెళ్లి చేసుకుందామని ప్రాధేయపడింది. అందుకు అతడు నిరాకరించడంతో ఈ నెల 16న ఇరుంబుపాలెం వద్ద అతడిపై యాసిడ్‌తో దాడిచేసింది. ముఖంపై యాసిడ్ పడడంతో కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడు చూపు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో షాబాకు కూడా స్వల్పంగా గాయాలైనట్టు పోలీసులు తెలిపారు.  

By admin

Leave a Reply

Your email address will not be published.