తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై మొదలైన కేసీఆర్ రైతు ఉద్యమం ఇప్పుడు జాతీయ స్థాయికి వెళ్లింది. రైతుల పోరాటంతోనే కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రద్దయ్యాయని కేసీఆర్ తెలిపిన సంగతి తెలిసిందే. అయితే.. చట్టాలు రద్దు చేసినట్లుగానే.. రైతులపై దేశవ్యాప్తంగా నమోదైన కేసులను ఎత్తివేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరారు. రైతు ఉద్యమంలో మరణించినవారి కుటుంబాలను ఆదుకోవాలని సూచించారు. ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలకు తెలంగాణ నుంచి రూ.3 లక్షల పరిహారం అందించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.