సినిమాలతో పాటు సీరియల్స్‌లోనూ నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది ప్రియ. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న ప్రియకు ఇటీవల బిగ్‌బాస్ షో నుంచి పిలుపు వచ్చింది. వెంటనే వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ షోలో వాలిపోయింది. అక్కడ ఇతర కంటెస్టెంట్లను, వారి గేమ్‌ను అంచనా వేస్తూ ఎత్తుకు పైఎత్తులు వేస్తూ గేమాడింది ప్రియ. కెప్టెన్సీ కాలేరని తెలిసినా చిరునవ్వుతో ఆ నిర్ణయాన్ని స్వాగతించి ఎందరో మనసులను కొల్లగొట్టింది. చివరకు అసాధ్యం అనుకున్న కెప్టెన్సీని సైతం సుసాధ్యం చేస్తూ ఐదో వారం కెప్టెన్‌గా అవతరించింది.
కానీ సన్నీతో వైరం కొనితెచ్చుకుని అతడి మీద నోరు పారేసుకోవడంతో అప్రతిష్ట మూటగట్టుకుంది. టాస్క్‌లో అతడిని రెచ్చగొట్టడం, చెంప పగలగొడతానంటూ హెచ్చరించడంతో సోషల్ మీడియాలోను ఆమెను ట్రోల్ చేశారు. ఫలితంగా ఓట్లు తగ్గి ఏడో వారంలో షో నుంచి ఎలిమినేట్ అయింది.