హైదరాబాద్‌: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన రియల్‌ ఎస్టేట్‌ దళారీ హితేష్‌ జోషితో బంగ్లాదేశ్‌కు చెందిన సిరిన అక్తర్‌ హుస్సేన్‌కు ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైంది. ఇది ప్రేమగా మారడంతో ఇతడి కోసం ఆమె అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చింది. హైదరాబాద్‌ నుంచి బోగస్‌ గుర్తింపు పత్రాలు పొందింది. ఇటీవల ఆ విషయం వెలుగులోకి రావడంతో గుజరాత్‌ పోలీసులు సిరినను అరెస్టు చేశారు. ఈమెకు ఫోర్జరీ పత్రాలు అందించిన నగరవాసి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. దీనికోసం ఓ ప్రత్యేక బృందం ఆదివారం సిటీకి చేరుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు..

హితేష్‌– సిరిన మధ్య 2016లో ఫేస్‌బుక్‌ స్నేహం ఏర్పడటంతో ఫోన్‌ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆ తర్వాత వాట్సాప్‌ చాటింగ్స్‌లో ప్రేమించుకున్నారు. తొలుత హితేష్‌ను కలుసుకోవాలని భావించిన సిరిన 2017 మార్చిలో 90 రోజుల విజిట్‌ వీసాపై భారత్‌కు వచ్చి వెళ్లింది. ఆపై అతడితోనే కలిసి జీవించాలని నిర్ణయించుకుని అక్రమ మార్గంలో సరిహద్దులు దాటి భారత్‌కు వచ్చేసింది.

By admin

Leave a Reply

Your email address will not be published.