అటవీ ప్రాంతాల్లో ఎన్ని ఘటనలు జరుగుతున్నా.. సకాలంలో వైద్యం అందక తల్లిబిడ్డల ప్రాణాలు కోల్పోతున్నా.. అధికారులు మాత్రం చలించడం లేదు.. పాపం ఆ అమాయక గిరిజనుల తలరాతలు ఎన్నటికీ మారడం లేదు. మా గ్రామానికి రోడ్డు మార్గం కల్పించండి మహాప్రభో అంటూ వేడుకున్నా.. అధికారులు చలించడం లేదు. ఏజెన్సీలో నిండు గర్భిణీ కి మళ్ళీ డోలి మోత తప్పలేదు. రహదారి సౌకర్యం లేక గ్రామానికి అంబులెన్స్ రాకపోవడంతో కిలోమీటర్లు మోసుకెళ్ళి అంబులెన్స్ ఎక్కించారు గ్రామస్తులు. విశాఖపట్నం జిల్లా పరిధిలోని రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీలోని సింగి ఆదివాసీ గిరిజన గ్రామానికి రహదారి సౌకర్యం ఉండదు. రోగం వచ్చినా, అత్యవసర పరిస్థితులు వచ్చినా కాలినడకే వారికి దిక్కు. తీవ్ర అనారోగ్యం అయితే అప్పటికప్పుడు డోలి మోత మోయాల్సిందే. సింగి గ్రామానికి చెందిన గేమిల రాజేశ్వరి అనే మహిళ నిండు గర్భిణీ. ప్రసవ సమయం కావడంతో ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆరోగ్యం క్రమంగా ఆందోళనకరంగా మారడంతో ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. దీంతో ఆ గ్రామస్తులు ఆంబులెన్స్‌కు కాల్ చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published.