డ్రగ్స్ స్మగ్లింగ్ గుట్టురట్టు అయ్యింది. హైదరాబాద్‌ మీదుగా విదాశాలకు డ్రగ్స్ రవాణా జరుగుతున్నట్లుగా గుర్తించారు. ఇక్కడి నుంచి కొన్ని ఇంటర్నేషనల్‌ కొరియర్‌ ఏజెన్సీల ద్వారా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, జర్మనీ తదితర దేశాలకు చేరుతున్నట్లుగా తేల్చారు. కిలోలకొద్దీ మెఫిడ్రిన్‌, ఎఫిడ్రిన్‌, సూడో ఎఫిడ్రిన్‌ దేశ సరిహద్దులు దాటింది. పోలీసులు, డీఆర్‌ఐ అధికారులు కొద్దిరోజుల క్రితం ఫొటో ఫ్రేముల్లో ఆస్ట్రేలియాకు వెళ్తున్న రూ.5.5 కోట్ల సూడో ఎఫిడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నాకగాని అసలు సంగతిని గుర్తించలేక పోయారు. అది ఎక్కడి నుంచి వస్తోంది.. ఎవరు తెస్తున్నారు.. అనేది గుర్తించేపని ఉన్నారు అధికారులు. ఇదే అంశాలపై పరిశోధించగా.. ఏపీ, తమిళనాడు, కర్ణాటకల్లోని డ్రగ్స్‌ మాఫియాకు సంబంధం ఉందని ప్రథమికంగా గుర్తించారు.

ఈ ఆధారాల ద్వారా తెరవెనుక మంత్రాంగం ఎవరు నిర్వమిస్తున్నే పనిలో పడ్డారు డెరెక్టర్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటిలిజెన్స్‌ అధికారులు. మరోవైపు అమెరికాకు వస్తున్న ఎఫిడ్రిన్‌, మెఫిడ్రిన్‌లపై ఆ దేశ నేర పరిశోధన విభాగం ఆరా తీస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఈ విభాగం అధికారులు హైదరాబాద్‌కు వచ్చి పోలీసు ఉన్నతాధికారులను కలిసి వెళ్లినట్లు సమాచారం.

By admin

Leave a Reply

Your email address will not be published.