దేశ పరిపాలన కేంద్రంగా ఉన్న ఢిల్లీలో వాయు కాలుష్యం అంతకంతకు పెరుగుతోంది. లక్షలాది వాహనాలు, పరిశ్రమల వల్లే ఉత్పన్నమయ్యే ప్రమాదకరమైన విషవాయువుల బారిన జనం పడుతుంటే ఏం చేస్తున్నారని సుప్రీం కోర్టు ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతటి ప్రమాదకరమైన పరిస్థితులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరించడంపై సీరియస్ అయింది. అంతే కాదు….ఢిల్లీలో సాధారణ ప్రజలు విషవాయువులు పీలుస్తుంటే.. ఫైవ్ స్టార్ హోటళ్లలో ఉండేవాళ్లు రైతులపై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించింది. కాలుష్యానికి కారణం రైతులను చూపిస్తున్నారని , కాని దీపావళి 10 రోజుల తరవాత కూడా ఢిల్లీలో టపాసులు ఎలా పేలుతున్నాయిని సీజేఐ రమణ ప్రశ్నిచారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఢిల్లీలో ఇలాంటి పరిస్థితి తలెత్తిందన్నారు. పొల్యూషన్‌కి సొల్యూషన్ వెదకకుండా … కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం మానుకోవాలని ఆదేశించింది.