అమరావతి: సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సీబీఐ దర్యాప్తుపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈకేసుకు సంబంధించి తాజా స్టేటస్‌ రిపోర్టును సీబీఐ హైకోర్టులో దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు నిందితులను అరెస్టు చేసి ఛార్జ్‌షీట్‌ వేశామని సీబీఐ తరఫు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. విదేశాల్లో ఉన్న నిందితులను విచారించేందుకు కూడా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సీబీఐ దృష్టి సారించాలని ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణ ఈనెల 28కి వాయిదా పడింది.

By admin

Leave a Reply

Your email address will not be published.