ఉక్కునగరం:విశాఖ ఉక్కు కార్మికుల వేతన సవరణ బకాయిలు వెంటనే చెల్లించాలని గుర్తింపు సంఘం యాజమాన్యాన్ని డిమాండ్ చేసింది. స్టీల్‌ప్లాంట్ ఏటియు కార్యాలయంలో జై సింహాచలం అధ్యక్షతన జరిగిన సమావేశంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి వైటి దాస్ మాట్లాడారు. వెంటనే యాజమాన్యం ఎరియర్స్ చెల్లించకుంటే అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ఆందోళన చేస్తామని హెచ్చరించారు. గత నెల 22న జరిగిన ఎంఓయూ ఆధారంగా సెయిల్‌లో నూతన కార్మికులందరికీ చెల్లించారని ఎంజెసిఎస్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా భాగమేనన్నారు. ఈ సమావేశంలో బొడ్డు పైడిరాజు, జి.గణపతి రెడ్డి, డి.సురేష్‌బాబు, జిఆర్కె నాయుడు, సిహెచ్ సన్యాసిరావు, డివి రమణరెడ్డి, శ్రీనివాసరెడ్డి, కరణం సత్యారావు, దొమ్మేటి అప్పారావు, కృష్ణారావు, మహాలక్ష్మి నాయుడు, వెంకటేశ్వర్లు, శ్రీనివాసరెడ్డి, వెంకటరమణ పాల్గొన్నారు.