ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌ వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయన్‌సింగ్‌ యాదవ్‌ 82వ జన్మదిన వేడుకలు సమాజ్‌ వాదీ పార్టీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి డాక్టర్‌ నమ్మి అప్పలరాజు యాదవ్‌ ఆధ్వర్యంలో ఎన్‌ఏడి కొత్తరోడ్‌లో సోమవారం ఘనంగా నిర్వహించారు. సమాజ్‌ వాదీ పార్టీ పెందుర్తి నియోజకవర్గం ఇంచార్జ్‌గా కిలాడి అప్పలరాజుని ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి డాక్టర్‌ నమ్మి అప్పలరాజు యాదవ్‌ నియమించి కండువా కప్పి పార్టిలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుకొండ వీరేంద్ర యాదవ్‌, రమేష్‌ యాదవ్‌, వియ్యపు అప్పలరాజు, ఆనంద్‌, లండా అప్పన్న, ఒమ్మి కనకరాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు .

By admin

Leave a Reply

Your email address will not be published.