కేంద్రంలో బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఉద్యమం చేసి విజయం సాధించారని 36వ వార్డు మాజీ కార్పొరేటర్‌ బోట్ట ఈశ్వరమ్మ అన్నారు. రైతుల విజయాన్ని కీర్తిస్తూ 51వ వార్డు పరిధి కళింగనగర్‌లో సిపిఎం, సిఐటియు, డివైఎఫ్‌ఐ, ఐద్వా ఆధ్వర్యాన కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు కూన వెంకటరావు మాట్లాడుతూ మూడు నల్ల వ్యవసాయ చట్టాలను పార్లమెంట్‌లో రద్దుచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎస్‌.నాయినిబాబు, సిపిఎం నాయకులు సనపల రామ్‌గోపాలరావు, కె.వెంకటరావు, జిఎన్‌.మూర్తి, నాయుడుబాబు, ఎస్‌టివి రమణమూర్తి, కృష్ణ, బిటి స్వామి, శ్రావణ్‌ కుమార్‌, చిలకమ్మ, శ్రీదేవి, పార్వతి, భాగ్య, జనార్దనమ్మ, సాయి, పాండురంగారావు, హెచ్‌.అప్పారావు, కుమారస్వామి, యుఎస్‌ఎన్‌.రాజు, ఎస్‌.మాధవ, ఎస్‌.శరత్‌, బి.రమేష్‌ పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.