హైదరాబాద్ : ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు.. హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. జగన్ బెయిల్ రద్దు చేసి సీబీఐ విచారణ త్వరితగతిన జరిగేలా ఆదేశాలివ్వాలని కోరారు. జగన్ పై ఉన్న 11 ఛార్జ్ షీట్లు పై సమగ్రమైన దర్యాప్తు చేయాలని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. గతంలో జగన్ బెయిల్ రద్దు చేయాలని వేసిన పిటిషన్ ను నాంపల్లి సీబీఐ కోర్టు కొట్టివేసింది. ఇక ఇప్పుడు హైకోర్టు లో దాఖలైన పిటీషన్ పై విచారణ చేయనున్నారు.