పాడేరు: గిరిజనులపై పాలకుల కుట్రలను తిప్పికొట్టాలని సిపిఎం మండల కార్యదర్శి ఎల్‌.సుందరరావు పిలుపునిచ్చారు. మండలంలోని మినుములూరు కాఫీ కాలనీలో పార్టీ నాయకులు పి.లక్కు, కె.కాంతమ్మ అధ్యక్షతన సిపిఎం మండల మహాసభ ఘనంగా జరిగింది. సభ ప్రారంభానికి ముందు పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం జరిగిన సభలో సుందరరావు మాట్లాడుతూ ప్రభుత్వ వెబ్‌సైట్ల నుంచి గిరిజన ఉప తెగలను తొలగించడం అన్యాయమన్నారు. కాఫీ, ఉపాధి హామీ బకాయి సొమ్మును చెల్లించాలని, అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలని, రహదారులు, తాగునీరు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. జిఒ-3 రిజర్వేషన్‌కు చట్టబద్ధత, ఎస్‌టి వాల్మీకి, భగత తెగలను ప్రభుత్వ వెబ్‌ సైట్‌లలో నుంచి తొలగించడాన్ని ఖండించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని, రైతుల పోరాటానికి మద్దతుగా నిలవాలని తదితర అంశాలపై మహాసభలో తీర్మానాలు ప్రవేశ పెట్టారు. ఏకగ్రీవంగా ఆమోదించారు. మహాసభకు ముఖ్య అతిథులుగా పార్టీ నాయకులు పి.అప్పలనర్స, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు ఆర్‌.శంకరరావు హాజరయ్యారు. మండల కమిటీ సభ్యులు చిట్టిబాబు, సత్యనారాయణ, సూరిబాబు, తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.