కలెక్టరేట్‌ : ఎఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్‌ గాంధీ గుంటూరు, విశాఖపట్నంలో త్వరలో పర్యటించనున్నారని ఎఐసిసి వర్కింగ్‌ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడు, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌ తెలిపారు. బుధవారం విజెఎఫ్‌ ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అమరావతి రాజధాని కోసం అనేక నెలలుగా దీక్షలు చేస్తున్న రైతులను రాహుల్‌ గాంధీ పరామర్శించి మద్దతు తెలుపుతారన్నారు. విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటుపరం కాకుండా చూడాలని కార్మికులు చేస్తున్న దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు ఇస్తారని చెప్పారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండగా ఏర్పాటుచేసిన విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ను ఎట్టిపరిస్థితులలోనూ ప్రైవేట్‌ పరం కాకుండా కాంగ్రెస్‌ అడ్డుకుంటుందని తెలిపారు. మూడు రాజధానులు అంటూ వైసిపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తొందరపాటుతో చేసిందన్నారు. ఎస్సి, ఎస్టి, మైనారిటీ, విద్యార్థులకు స్కాలర్‌ షిప్పులు, మెస్‌ చార్జీలు, పాకెట్‌ మనీ, ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఎపిలో త్వరలోనే పిసిసి మార్పు ఉంటుందన్నారు. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ కాంగ్రెస్‌ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని చెప్పారు. కాంగ్రెస్‌ పాలనతో పోలిస్తే నేడు ధరలు మూడు రెట్లు పెరిగాయని ఆరోపించారు.

By admin

Leave a Reply

Your email address will not be published.