ఆర్దికంగా కష్టాల్లో ఉన్న ఏపీ ప్రభుత్వం రుణ సమీకరణ కోసం అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. తమ పరిధిలో ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవటానికి సిద్దంగా లేదు. ఒక వైపు సంక్షేమ పధకాల భారం.. మరో పైపు పెరగని రెవిన్యూతో కొత్త మార్గాల్లో అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా..ఇప్పటికే విశాఖలో కొన్ని ఆస్తులను తనఖా రిజిస్ట్రేషన్ చేసిన ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఏపీ లోని రాష్ట్ర వ్యాప్తంగా రహదారులు భవనాల శాఖ(ఆర్అండ్బీ)కు అన్ని జిల్లాల్లో ఉన్న రూ.3,786.15 కోట్ల విలువైన ఆస్తులను ఏపీ రహదారుల అభివృద్ధి సంస్థ (ఏపీఆర్డీసీ)కు బదలాయిస్తూ గజెట్ జారీ చేసింది.
ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ లో ఆర్ అండ్ బి శాఖ పరిధిలోని 574.37 ఎకరాల స్థలాలు, రూ.392.50 కోట్ల విలువైన 3.31 లక్షల చదరపు గజాల విస్తీర్ణంలో భవనాలు ఉన్నాయి. కాగా, వీటి విలువ దాదాపుగా ,
కోట్లుగా నిర్ధారించారు. అయితే, ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ లో భాగంగా ఏపీఆర్డీసీ అదనపు ఆదాయ వనరులు సమీకరించుకొని, రహదారుల సదుపాయాలు మెరుగుపరుచుకొనేందుకు వీలు కలుగుతుందని పేర్కొంది. గతంలోనే ఆర్డీసికి ఆదాయం ఏ విధంగా సమీకరించుకోవాలనే అంశం పైన అధ్యయనం చేసారు.