గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌ శనివారం నుంచి వంద రోజలు పాటు జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. స్వచ్ఛాంధ్రపదేశ్‌ నినాదంతో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. చెత్త సేకరణ కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయనున్నట్లు ​వెల్లడించారు. గ్రామాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు పెద్దిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో  13 వేలకు  పైగా  ఉన్న  పంచాయితీల్లో సాలీడ్  వేస్ట్  మేనేజ్మెంట్   సిస్టం  ప్రవేశ  పెడుతున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో 10  వేల  మంది  గ్రామ  పంచాయితీ  కార్మికులు పాల్గొంటారని తెలిపారు. కొత్తగా 4,171 చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల నిర్మాణం చేపట్టనున్నాం అని తెలిపారు.

By admin

Leave a Reply

Your email address will not be published.