ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎంబీబీఎస్‌ చదువును మధ్యలో ఆపేసిన అనూషకు మంత్రి కేటీఆర్‌ ఆర్థిక సాయం అందించారు. బుధవారం ప్రగతిభవన్‌లో ఆమెకు రూ.5 లక్షల నగదు అందజేశారు. ‘వైద్య విద్యార్థినికి విద్యాగండం’ శీర్షికన ‘ఈనాడు’ ప్రధాన పత్రికలో ఆగస్టు 12న ప్రచురితమైన కథనానికి మంత్రి కేటీఆర్‌ స్పందించిన విషయం తెలిసిందే. ఆమె చదువు కొనసాగించేలా అవసరమైన సాయం అందిస్తామని తెలిపారు. ఈ మేరకు ఆర్థిక సాయం అందించి వైద్యురాలిగా ఆమె తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, అనూష మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

By admin

Leave a Reply

Your email address will not be published.