హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ కార్మిక, ఉపాధి కల్పన శాఖ ఆధీనంలోని నేషనల్ కెరియర్ సర్వీస్ సెంటర్ ఫర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ (ఎన్.సి.ఎస్.సి.డి.ఎ) కేంద్రం వారు దివ్యాంగులకు ఉచిత వృత్తి విద్య శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ డిప్యూటీ డైరెక్టర్, ఉమా శంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. దీనిలో భాగంగా పలు వృత్తి విద్యా కోర్సులు అయిన సెక్రటేరియల్ ప్రాక్టీస్, ఎలక్ట్రానిక్స్, ప్రింటింగ్, బుక్ బైడింగ్, మొబైల్ ఫోన్ రిపేరింగ్, వాచ్ అండ్ క్లాక్ రిపేరింగ్ లలో అర్హులైన దివ్యాంగులకు ఉచిత శిక్షణ ఇవ్వబడుతుంది. పూర్తి వివరాల కొరకు హైదరాబాద్ లోని విద్యానగర్ లో ఉన్న ఎన్.ఎస్.టి.ఐ క్యాంపస్ లోని కార్యాలయాన్ని సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.