తిరుమల: టీటీడీ పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జమ్మూలో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి రూ.17.40 కోట్లు మంజూరు చేశారు. అలిపిరి కాలిబాట సుందరీకరణకు రూ.7.50 కోట్లు మంజూరు చేశారు. కడప జిల్లా రాయచోటిలో కల్యాణమండపం నిర్మాణానికి రూ.2.21 కోట్లు, టీటీడీ కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఉద్యోగ భద్రతకు ఆప్‌కాస్‌ తరహాలో టీటీడీ కార్పొరేషన్‌ ఏర్పాటుకు పాలకమండలి ఆమోదం తెలిపింది. టీటీడీ ఉద్యోగుల హెల్త్‌ ఫండ్‌కు కూడా పాలకమండలి ఆమోదం తెలిపింది. వరాహస్వామి విశ్రాంతి భవనం-2లో మరమ్మతులకు రూ.2.61 కోట్లు, స్విమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలోని పలు నిర్మాణాలకు రూ.4.46 కోట్ల నిధులు కేటాయించారు.

By admin

Leave a Reply

Your email address will not be published.