హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులతో కేంద్ర జలశక్తి శాఖ సమీక్ష ముగిసింది. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ ఛైర్మన్లు ఎంపీ సింగ్, చంద్రశేఖర్ అయ్యర్‌లతో హైదరాబాద్ జలసౌధలో కేంద్ర జలవనరులశాఖ అదనపు కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ సమావేశమయ్యారు. రెండు బోర్డుల పరిధి గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణ పురోగతిని సమీక్షించారు. రెండు రాష్ట్రాల నుంచి ఇప్పటి వరకు అందిన సమాచారం, వివరాలను కేంద్ర అదనపు కార్యదర్శికి బోర్డు ఛైర్మన్లు వివరించారు. సమీక్ష ఆధారంగా దేవశ్రీముఖర్జీ కేంద్ర జలశక్తి శాఖకు నివేదిక అందించనున్నారు.