ఏపీలో కరోనా కేసులు ఇవాళ మరోసారి తగ్గాయి. నిన్న 800 నమోదైన కరోనా కేసులు ఇవాళ 600 లకు పడిపోయాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 643 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,55, 306 కి పెరిగింది.

ఒక్క రోజు వ్యవధిలో మరో 08 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14,236 కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 839 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8550 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి.ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20,32, 520 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 48, 028 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2, 86, 12 , 576 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

By admin

Leave a Reply

Your email address will not be published.