సికింద్రాబాద్: దసరా పండుగను పురస్కరించుకుని 4 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. వీటిలో సికింద్రాబాద్‌-నర్సాపూర్‌ స్పెషల్‌ (రైల్‌ నంబరు:07456) ఈ నెల 14న రాత్రి 10.55 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 10 గంటలకు నర్సాపూర్‌ చేరుతుంది. నర్సాపూర్‌-సికింద్రాబాద్‌ స్పెషల్‌ (07455) ఈ నెల 17న సాయంత్రం 6 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 4.10 గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది. సికింద్రాబాద్‌-కాకినాడ టౌన్‌ స్పెషల్‌ (07053) ఈ నెల 14న రాత్రి 8 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు కాకినాడ టౌన్‌ చేరుతుంది. కాకినాడ టౌన్‌-సికింద్రాబాద్‌ స్పెషల్‌ (07054) ఈ నెల 17న రాత్రి 8.45 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.25 గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది.

By admin

Leave a Reply

Your email address will not be published.