పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి ఆర్థిక సంఘం కేటాయింపులే తప్ప.. ఇందులో కేంద్రమిచ్చేది ఏమీ ఉండవనీ, ఇది అందరూ అవగాహన పెంచుకోవాల్సిన మూల సూత్రమని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ‘పల్లె-పట్టణ ప్రగతి’పై గురువారం శాసనసభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లు భట్టివిక్రమార్క మాట్లాడే క్రమంలో.. ”పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రమే నిధులు వస్తున్నాయి. ఉపాధి హామీ కింద విడుదలైన నిధులనే వినియోగిస్తున్నాం తప్ప..
రాష్ట్ర నిధులు విడుదల కావడం లేదని సర్పంచులు చెబుతున్నారు”అని పేర్కొన్నారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందించారు. ”దేశాన్ని నడిపే క్రమంలో రాజ్యాంగం సూచించే పద్ధతుల్లో కొన్ని వ్యవస్థలు ఏర్పాటు చేశారు. అందులో కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లు ఉంటాయి.
భారత ఆర్థిక సంఘం అనేది కూడా ఒకటి ఉంది. అయిదేళ్లకోసారి దీన్ని నియమిస్తారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి, అంచనాలు వేసుకొని, స్థానిక స్వపరిపాలన సంస్థలు కూడా చక్కగా పనిచేయాలి కాబట్టి.. వాళ్లకు ప్రతి రాష్ట్రానికి ఏటా ఇంత ఇవ్వాలి..