హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు చిత్రపటాన్ని శుక్రవారం ఆవిష్కరించారు. శాసనసభ భవనంలోని శాసనసభ్యుల లాంజ్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, శాసనమండలి ప్రొటెం చైర్మెన్ వెన్నవరం భూపాల్ రెడ్డి లు పీవీ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ టి పద్మారావు గౌడ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పివి నరసింహా రావు శతజయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షులు,ఎంపీకే కేశవరావు, మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.