CM KCR : ప్రపంచంలో ప్రజాక్షేత్రమే అతిపెద్ద కోర్టని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ మధ్య రాజకీయాల్లో కొంతమంది చాలా చీప్‌గా మాట్లాడుతున్నారని… ఎవరూ వాళ్ల జేబుల్లో డబ్బులు తీసి సంక్షేమ కార్యక్రమాలు చేయరని అన్నారు. ప్రజలు కట్టే పన్నులను సమన్వయం చేసి, మళ్లీ వారి సంక్షేమం కోసం ఖర్చు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కొందరు చౌకబారు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక ఏ ఎన్నిక జరిగినా టీఆర్ఎస్ గెలుస్తుందని… ప్రజలు తమకు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారన్నారు.
అల్పాదాయ వర్గాలకు భారీ నిధులు వెచ్చించి, అభివృద్ధి చేస్తున్నామన్నారు. కేంద్రం… మాకంటే ఎక్కువ అప్పులు చేసిందని.. నిధులను దారి మళ్లిస్తుందని ఆరోపించారు.