కడప జిల్లాకు చెందిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ వింజమూరు రామనాథ రెడ్డిని చిత్తూరు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చాలా కాలంగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన రామనాధ రెడ్డిని పోలీసులు కుప్పం – కృష్ణగిరి హైవేలో అరెస్టు చేశారు. ఎర్ర చందనాన్ని లారీలో తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు రామనాధ రెడ్డితో పాటుగా అతని అనుచరులు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్లలో ఒకరిగా ఉన్న రామనాధరెడ్డిని అరెస్ట్ చేయడంతో పోలీసులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

పోలీసుల అదుపులో ఇంటర్నేషనల్ ఎర్ర చందనం స్మగ్లర్ రామనాథ రెడ్డి

పోలీసులు అదుపులోకి తీసుకున్న రామనాధ రెడ్డిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయి. ఇతను ఎర్రచందనం స్మగ్లింగ్ కు సంబంధించి మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్స్ లో ఒకడని పోలీసులు చెబుతున్నారు. గత కొద్దిరోజులుగా ఎర్రచందనం స్మగ్లింగ్ పై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిన ఏపీ పోలీసులు వరుసగా ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్న స్మగ్లర్ లను అరెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రామనాధ రెడ్డి యాక్టివిటీస్ పైన నజర్ పెట్టిన పోలీసులు ఈరోజు తెల్లవారుజామున పక్కా సమాచారంతో అంతర్జాతీయ స్మగ్లర్ రామనాధ రెడ్డిని అరెస్ట్ చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published.