ఇటిక్యాల: దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో బాగంగా మూడవ బీచుపల్లి క్షేత్రంలోని లక్ష్మీ హయగ్రీవ జ్ఞాన సరస్వతి ఆలయంలో అమ్మవారు విజయలక్ష్మి అవతారంలో కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. . ఆలయ అర్చకులు భవనచంద్ర అమ్మవారికి సుప్రభాతసేవ, తిరువరాధన, కుంకుమార్చన, నైవేద్య నిరాజనాలు, అన్నప్రాసన అక్షరాభ్యాసం, కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ మేనేజర్ సురేందర్‌రాజు కార్యక్రమాలను పర్యవేక్షించారు. అలాగే క్షేత్రంలోని ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో కొలువుదీరిన అమ్మవారు శాకాంబరి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.

By admin

Leave a Reply

Your email address will not be published.