హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.బతుకమ్మ పండుగ సంబురాలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. తెలంగాణకు చెందిన మహనీయులను, వైతాళికులను, కవులు, కళాకారులను, సాహితీవేత్తలను, పోరాటయోధులను గౌరవిస్తూ, వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తున్నామని అన్నారు.
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ – తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో రూపొందించిన బతుకమ్మ పాటను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హైదరాబాద్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బతుకమ్మ వేడుకలు ప్రధాన పాత్ర పోషించాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం సీఎం కేసీఆర్ ఎన్నో చర్యలు చేపట్టారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.