ఐపీఎల్ 2021 లో నిన్న చెన్నై సూపర్ కింగ్స్ – ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మొదటి క్వాలిఫైర్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో విజయం సాధించి చెన్నై జట్టు ఐపీఎల్ చరిత్రలో 9వ సారి ఫైనల్స్ కు చేరుకుంది. అయితే ఈ మ్యాచ్ లో 173 పరుగుల లక్ష్యంతో వచ్చిన చెన్నై జట్టు లో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(70) అర్ధశతకంతో రాణించిన మరో ఓపెనర్ ఫాఫ్ డు ప్లెసిస్(1) నిరాశ పరిచాడు. ఇక ఆ తర్వాత వచ్చిన రాబిన్ ఉతప్ప(60) కూడా హాఫ్ సెంచరీతో స్కోర్ బోర్డును ముందునడపగా ిన చివరి ఓవర్ లో చెన్నైకి 13 పరుగులు కావాల్సి ఉంది. ఆ సమయంలో మొదటి బంతికే మోయిన్ అలీ(16) వెనుదిరుగుతాడు. ఆ తర్వాత ధోని వరుస మూడు ఫోర్లు అలాగే బౌలర్ వైడ్ కారణంగా చెన్నై మరో రేంజు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించి ఐపీఎల్ 2021 మొదటి ఫైనలిస్ట్ గా నిలిచింది. ఇక ఓడిన ఢిల్లీ క్వాలిఫైర్ 2 కి వచ్చింది. ఈరోజు బెంగళూరు – కోల్‌కతా మధ్య జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్ లో విజయం సాధించిన వారితో ఢిల్లీ ఆడుతుంది.

By admin

Leave a Reply

Your email address will not be published.