హైదరాబాద్‌: బంగాళాఖాతంలో అండమాన్‌ దీవుల పరిసర ప్రాంతాల్లో 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు గాలులతో ఉపరితల ఆవర్తనం ఉంది. దీని ప్రభావంతో సోమవారం అక్కడే అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా. ఇది మరింత బలపడి నాలుగైదు రోజుల్లో ఉత్తరాంధ్ర తీరానికి వచ్చే అవకాశాలున్నాయి. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి గాలులతో ఉపరితల ద్రోణి 1500 మీటర్ల ఎత్తున.. కోస్తాంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల మీదుగా అరేబియా సముద్రంపై ఉన్న మరో ఉపరితల ఆవర్తనం వరకు వ్యాపించింది. వీటి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.

By admin

Leave a Reply

Your email address will not be published.