యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యుపిఎస్‌సి) ప్రిలిమినరీ పరీక్షలకు సగం మందికిపైగా అభ్యర్ధులు హాజరుకాలేదు. ఆదివారం జిల్లాలోని 32 కేంద్రాల్లో నిర్వహించిన యుపిఎస్‌సి పరీక్షలకు 12,167 మంది హాజరుకావాల్సివుండగా, ఉదయం 9.30 నుంచి 11.30 గంటలకు వరకు జరిగిన పరీక్షకు 4,964 మంది (40.80శాతం), మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 వరకు జరిగిన పరీక్షకు 4,895 మంది (40.23శాతం) హాజరయ్యారు. ఉదయం 7,203 మంది, మధ్యాహ్నం 7,272 మంది అభ్యర్ధులు పరీక్షకు హాజరుకాలేదు. గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్‌ దండే, పర్యాటకశాఖ ఎమ్‌డి ఎస్‌.సత్యనారాయణ, యుపిఎస్‌సి డిప్యూటీ డైరెక్టర్‌ ఎస్‌కె కుల్‌దీప్‌సింగ్‌ గుర్వ పలు పరీక్షా కేంద్రాలను సందర్శించారు. విశాఖ వ్యాలీ స్కూల్‌, గాయత్రి విద్యా పరిషత్‌ కాలేజీలో జరిగిన పరీక్షా కేంద్రాలను కలెక్టర్‌ డాక్టర్‌ మల్లికార్జున పరిశీలించారు.

By admin

Leave a Reply

Your email address will not be published.