కలెక్టరేట్‌ : విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ ప్రభుత్వ రంగంలో నడవాలనే చిత్తశుద్ధి ఉంటే వైసిపి కేంద్రంపై పోరాటం చేయాలని విశాఖ పార్లమెంట్‌ టిడిపి అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌, ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన దీక్షలు ఆదివారం నాటికి 192వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో టియన్‌టియుసి నాయకులు కూర్చున్నారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, గంగవరం పోర్టులోని ప్రభుత్వం వాటా 10 శాతం అదాని గ్రూపునకు రూ.644 కోట్లకు అమ్మడం ఏమిటని ప్రశ్నించారు. గతంలో స్టీల్‌ ప్లాంట్‌ బిఐఎఫ్‌ఆర్‌కు వెళ్లే సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పటి ప్రధానమంత్రి వాజపేయిపై ఒత్తిడి చేసి రూ.1350 కోట్లు రుణమాఫీ చేయించి ప్లాంట్‌ను కాపాడారన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దసరా తర్వాత తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పోరాటం ప్రారంభిస్తామని చెప్పారు.

By admin

Leave a Reply

Your email address will not be published.