నర్సీపట్నం టౌన్‌ : వంట గ్యాస్‌ ధరల పెంపును వ్యతిరేకిస్తూ నర్సీపట్నం పాతబజార్‌ వీధిలో మహిళా సంఘం ఆధ్వర్యాన ఆదివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా ఉపాధ్యక్షులు ఎల్‌.గౌరి మాట్లాడుతూ, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రతి రోజూ వంట గ్యాస్‌ ధరలు పెంచి ప్రజలను ఆర్థికంగా దోచుకుంటుందని మండిపడ్డారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యాస్‌ ధరను సుమారు రూ.500 పెంచిందన్నారు. గ్యాస్‌తో పాటు నిత్యవసర వస్తువులు, పెట్రోల్‌, డీజిల్‌ అన్నిరకాల ధరలను పెంచుతుందన్నారు. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. పెంచిన గ్యాస్‌ ధరలను ఉపసంహరించుకోవాలని, లేకుంటే మహిళలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మోడీ చర్యలను వ్యతిరేకించకపోతే దేశాన్ని అమ్మేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో మంగ, రమణమ్మ, లక్ష్మి వెంకటమ్మ, దుర్గ గోవిందమ్మ, రాజేశ్వరి పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.