కోటవురట్ల : నర్సీపట్నం పోలవరం రోడ్డు నిర్మాణంలో ఉన్న పోలవరం కాలువ వద్ద ఆర్‌ అండ్‌ బి రోడ్డు పక్కన ఉన్న గుంత ప్రమాదకరంగా ఉంది. పోలవరం కాలువ నిర్మాణం కోసం తీసిన పునాది గుంత ప్రమాదకరంగా ఉన్నా అధికారులు, నాయకులు పట్టించుకోకపోవడం లేదని ఆ ప్రాంత వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు మార్గంలోనే స్థానిక ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, డివిజన్‌ స్థాయి అధికారులు నిత్యం ప్రయాణిస్తుంటారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారి గుండా పాయకరావుపేట, రాయవరం, కోటవురట్ల, నక్కపల్లికి అనేక వాహనాలు రెవిన్యూ కేంద్రమైన నర్సీపట్నం వెళ్తూ వస్తుంటాయి. వివిధ కంపెనీలకు వెళ్లే ఉద్యోగులతో రద్దీగా ఉంటుంది. ఈ రోడ్డు పక్కన గుంత ప్రమాదకరంగా ఉంది. రాత్రి సమయంలో వెళ్లే వాహనదారులు ఏ మాత్రం ఆదమరచినా ప్రమాదం తప్పదని వాహనదారులు చెబుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు కోతకు గురి కావడంతో మరింత ఆందోళన చెందుతున్నారు. అధికారులు ఇప్పటికైనా గుర్తించి ప్రమాదం జరగకముందే తగు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.