దేవరాపల్లి : రాష్ట్రంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి దక్కుతుందని ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు అన్నారు. దేవరాపల్లిలోని హైస్కూల్ ఆవరణలో డ్వాక్రా సంఘాలకు అమలు చేస్తున్న ఆసరా పథకాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. మండలంలో 999 డ్వాక్రా గ్రూపులకు సుమారు రూ.ఆరు కోట్లు చెక్కును ఆదివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజేశ్వరి, జడ్పిటిసి కర్రి సత్యం, బూరే బాబూరావు, ఆవుగడ్డ రామ్మూర్తినాయుడు, వరదపురెడ్డి సింహాచలం నాయుడు, ఎంపీడీవో సిహెచ్. సుబ్బలక్ష్మి పాల్గొన్నారు.