హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన సాగు చట్టాలపై సీఎం కేసీఆర్‌ వైఖరి తెలపాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి డిమాండ్ చేశారు. సాగు చట్టాలకు నిరసన తెలుపుతున్న రైతులపై యూపీలో జరిగిన దాడి ఘటనను ఖండించారు. ఉత్తర్‌ప్రదేశ్‌ లఖింపూర్‌ ఘటనను నిరసిస్తూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద చేపట్టిన మౌనదీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ.. మన సొంత భూముల్లోనే కూలీలుగా, బానిసలుగా మారే చట్టాలను తీసుకొచ్చి శాశ్వతంగా రైతుల జీవితం మీద మరణశాసనం రాస్తున్నారు.

అమిత్‌ షా, మోడీలకు ఏ రైతులైతే రెండు సార్లు అధికారం అప్పజెప్పారో ఇవాళ ఆ రైతులే వారిని గద్దె దించాలని కంకణం కట్టుకున్నారు. చట్టాలను ఉపసంహరించుకునే వరకు దేశవ్యాప్తంగా ధర్నాలు, దీక్షలు, రాస్తారోకోలు చేపడుతున్నారు. తెలంగాణ రైతులు కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యారు. మొదట్లో సీఎం కేసీఆర్‌ చట్టాలను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లొచ్చాక రైతుల గురించి ఒక్కమాట మాట్లాడట్లేదు అని రేవంత్‌ విమర్శించారు.

By admin

Leave a Reply

Your email address will not be published.