తిరుపతిలో సీఎం జగన్ రెండు రోజుల పాటు పర్యటిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం గన్నవరం నుంచి తిరుపతికి చేరుకున్నారు. అనంతరం సీఎం జగన్ బర్డ్‌లో శ్రీ పద్మావతి చిన్న పిల్లల కార్డియాక్ ఆసుపత్రిని ప్రారంభించారు. ఆ తరువాత అలిపిరి వద్ధ శ్రీవారి పాదాల వద్ద నుంచి నడక మార్గంలో కొత్తగా ఏర్పాటు చేసిన పైకప్పును, గో మందిరాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో సీఎం జగన్ పాల్గొనబోతున్నారు. తిరుమలకు చేరుకున్న తరువాత సీఎం బేడి ఆంజనేయ స్వామివారిని దర్శించుకుంటారు. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం తరుపున స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. శ్రీవారిని దర్శనం చేసుకున్న అనంతరం సీఎం జగన్ పద్మావతి గెస్ట్ హౌస్‌కు వెళ్లి రాత్రి అక్కడే బస చేయనున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.