టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali).. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan) పై చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా పెద్దదుమారమే రేగింది. టాలీవుడ్ (Tollywood)తో పాటు రాజకీయాల్లోనూ పోసాని కామెంట్స్ పై చర్చ జరిగింది. పవన్ కల్యాణ్ అభిమానులు తనను దూషిస్తూ మెసేజ్ లు, ఫోన్లు చేస్తున్నారంటూ పోసాని చేసిన ఆరోపణలు, పవన్ పై చేసిన తీవ్రవ్యాఖ్యలు, దూషణల పర్వం తర్వాత వాతవరణం వేడెక్కింది. పోసానిని అడ్డుకునేందుకు జనసేన కార్యకర్తలు యత్నించడం.. పోలీసుల సాయంలో పోసాని ఇంటికెళ్లడం జరిగాయి. అదే సమయంలో పవన్ కల్యాణ్ నుంచి, ఆయన అభిమానుల నుంచి ప్రాణహాని ఉందని పోసాని ఆరోపించిన సంగతి తెలిసిందే. తనకు ఏమైనా జరిగితే పవన్ కల్యాణ్ దే బాధ్యత అంటూ పోసాని కృష్ణమురళి గట్టిగానే విమర్శించారు.

దీంతో ఈ ఎపిసోడ్ పోసాని వర్సెస్ జనసేన కార్యకర్తలుగా మారిపోయింది. తాజాగా పోసాని కృష్ణమురళీ నుంచి తనకు ప్రాణహాని ఉందని జనసేన కార్యకర్తలు పోలీసులను ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన జనసేన కార్యకర్త రాజశేఖర్.. పోసానితో పాటు వైసీపీ కార్యకర్తలపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. గతంలో రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై జనసేన చేపట్టిన సోషల్ మీడియా ఉద్యమంతో పాటు శ్రమదానం కార్యక్రమాల్లో రాజశేఖర్ చురుగ్గా పాల్గొన్నారు. అలాగే అదే సమయంలో పోసాని వ్యాఖ్యలపై పలువురు కార్యకర్తలు విమర్శలు చేశారు. దీంతో రాజశేఖర్ కూడా పోసానికి అసభ్యకర మెసేజ్ లు పంపడంతో పాటు ఆయనను బెదిరించావంటూ స్థానిక వైసీపీ కార్యకర్తలు వేధించడం మొదలుపెట్టారు. స్థానికంగా ఎక్కడ కనిపించినే ఇదే అంశంపై నిలదీయడం, బెదిరిస్తుండటంతో రాజశేఖర్.. సత్తెనపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

By admin

Leave a Reply

Your email address will not be published.