ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మరోసారి తన సొంత జిల్లాలో పర్యటనకు వెళ్లనున్నారు.. ఇవాళ, రేపు రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది.. ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో ఇడుపులపాయకు చేరుకోనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ విజయరామరాజు, ఎస్పీ అన్బురాజన్‌లు పరిశీలించారు. ఇడుపులపాయలోని హెలిప్యాడ్, సీఎం బస చేసే నివాసం వద్ద పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఇక, ఇవాళ రాత్రి ఇడుపులపాయలోనే బస చేయనున్నారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్.. రేపు ఉదయం సీఎం సతీమణి భారతి తండ్రి ప్రథమ వర్ధంతి సందర్భంగా పులివెందుల తోటలోని గంగిరెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించి ప్రార్థనలు నిర్వహించనున్నారు.. ఆ తర్వాత ఇతర కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.