మహిళా సంక్షేమానికి తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. జివిఎంసి 1, 2 వార్డుల పరిధిలో గల 546 డ్వాక్రా సంఘాల్లోని 6228 మంది సభ్యులకు వైఎస్‌ఆర్‌ ఆసరా రెండో విడతలో భాగంగా రూ.4.13 కోట్ల చెక్కును ఆయన అందజేశారు. ఈ సందర్బంగా చిట్టి వలస బంతాట మైదానంలో జరిగిన బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్టంలో 31 లక్షల మంది మహిళలకు వారి పేరునే ఇళ్ల పట్టాలు ఇచ్చామని అన్నారు. 40 వేల మద్యం, బెల్టు షాపులను రద్దు చేశామన్నారు. సభలో విశాఖ ఆర్‌డిఒ పి.కిషోర్‌, తహశీల్దార్‌ కెవి.ఈశ్వరరావు, జోనల్‌ కమిషనర్‌ ఎస్‌వి.రమణ, జివిఎంసి కో – ఆప్షన్‌ సభ్యులు కొప్పల ప్రభావతి పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.