దశాబ్దాలుగా ఎస్సీ, ఎస్టీ పేద విద్యార్థులకు కార్పొరేట్‌ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడానికి ఉద్దేశించిన బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ స్కీమ్‌ పథకాన్ని పునరుద్ధరించాలని టిఎన్‌ఎస్‌ఎఫ్‌ విశాఖ పార్లమెంట్‌ అధ్యక్షుడు ఎస్‌.రతన్‌కాంత్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు టిఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యాన సోమవారం కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్సీ,ఎస్టీ పేద విద్యార్థులకు అందుబాటులో ఉన్న కార్పొరేట్‌ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించేందుకు ఉద్దేశించిన బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌ పథకాన్ని రద్దుచేయడం పేద విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిళ్లుతుందన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.