విజయవాడ: పులిచింతల ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి చేస్తుండటంతో దిగువకు వదులుతున్న నీరు ప్రకాశం బ్యారేజీకి వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ నుంచి 1,52,318 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్టు జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు. కృష్ణా డెల్టాలోని తూర్పు, పశ్చిమ కాలువలకు దాదాపుగా 15,368 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు. మిగిలిన 1.36 లక్షల క్యూసెక్కుల నీటిని బ్యారేజీలోని అన్ని గేట్లను ఎత్తి సముద్రంలోకి విడుదల చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం బ్యారేజీ క్రస్ట్ లెవల్ స్థాయికి మించి నీటి ప్రవాహం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాల కారణంగా ప్రకాశం బ్యారేజీ నుంచి గడిచిన కొన్ని రోజులుగా నిత్యం సగటున 30వేల క్యూసెక్కుల వరకూ నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు.

 

By admin

Leave a Reply

Your email address will not be published.