Dussehra Festival: తెలంగాణలో దసరా సందడి మొదలైంది. పండుగ సందర్భంగా నగరంలో బస్టాండ్‌లు రద్దీగా మారాయి. ప్రయాణికులను తరలించడానికి టీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మరోవైపు వివిధ ప్రాంతాలకు నడుపుతున్న ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీల వసూలును ఆర్టీసీ విరమించుకుంది. పండుగకి రెండు రోజులే సమయం ఉండడంతో మరింత రద్దీ పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

తెలంగాణలో దసరా పండగ కోసం ప్రయాణికులను తరలించడానికి ఆర్టీసీ 4035 అదనపు బస్సులు నడుపుతోంది. రోజుకు 4 కోట్ల అదనపు ఆదాయం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ 5 రోజుల్లో ఆర్టీసీ ద్వారా కోటి 30 లక్షల మంది ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరారు. ముందుగా ప్రత్యేక బస్సుల్లో అదనంగా 50 శాతం చార్జీలు వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ ఎండి సజ్జనార్ నిర్ణయంతో ఆర్టీసీ వెనక్కి తగ్గింది. ఎక్కడికి వెళ్లినా సాధారణ చార్జీలు మాత్రమే వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు.

By admin

Leave a Reply

Your email address will not be published.