చోడవరం : తుపానుకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందిస్తామని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ చెప్పారు. మండలంలోని చాకిపల్లి, రామజోగిపాలెం, కన్నంపాలెం తదితర గ్రామాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. పంట నష్టాలపై తక్షణమే నివేదికలు తయారుచేయాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోకి నష్టపరిహారం వస్తుందన్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి తక్షణమే పరిహారం అందుతుందని చెప్పారు.