హైదరాబాద్‌: ట్యాంక్‌బండ్‌పై ప్రతి ఆదివారం ‘సండే.. ఫన్‌ డే’ కొనసాగిస్తున్నట్లుగానే పాతబస్తీలోని చార్మినార్‌ వద్ద కూడా నిర్వహిస్తే బాగుంటుందనే విషయాన్ని ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీకి మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ ద్వారా సూచించారు. ఈ విషయాన్ని మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ సోమవారం తన ట్విటర్‌ ద్వారా రీ ట్వీట్‌ చేశారు.

ప్రస్తుతం టాంక్‌బండ్‌పై ప్రతి ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కొనసాగిస్తున్న నో వెహికిల్‌ జోన్‌ కార్యక్రమాన్ని చార్మినార్‌ వద్ద కూడా చేపడితే.. నగర ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించినట్లవుతుందని అర్వింద్‌కుమార్‌ అభిప్రాయపడ్డారు. పాతబస్తీ ప్రజలతో పాటు నగరంలోని ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజలు చార్మినార్‌కు చేరుకుని కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో సరదాగా.. సంతోషంగా గడిపే అవకాశం ఉంది.

By admin

Leave a Reply

Your email address will not be published.