కలెక్టరేట్‌: అగనంపూడిలో బాలిక మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఐద్వా ఆధ్వర్యాన జగదాంబ జంక్షన్లో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐద్వా నగర కార్యదర్శి వై.సత్యవతి, అధ్యక్షులు బి.పద్మ మాట్లాడుతూ, మహిళలపై జరుగుతున్న హింస, దాడులను అరికట్టుటలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయన్నారు. అగనంపూడి బాలిక కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కుమారి, భారతి, విమల, రంగమ్మ, అనురాధ, వేణు, వరలక్ష్మి, సంతోషం పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.