కోటవురట్ల : మాకవరపాలెంలోని అవంతి ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహించిన జాబ్‌ మేళాకు విశేష స్పందన లభించింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల వ్యవస్థాపక చైర్మన్‌, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ, కమ్యూనిటీ స్కిల్‌ ప్రత్యేక బోధన తరగతులు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. 28 ప్రముఖ కంపెనీలు నిర్వహించిన జాబ్‌ మేళాకు తమ విద్యా సంస్థల నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ బీసెట్టి సత్యవతి, స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌, జిల్లా ఎస్పీ కృష్ణా రావు, ఎన్‌టిపిసి మేనేజర్‌ దీపక్‌ కౌశిక్‌, కళాశాల ప్రిన్సిపల్‌ మోహనరావు, పరిపాలనాధికారి డానియల్‌ రాజు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.